మార్చి – ఏప్రిల్
శ్రీరామనవమి
తొమ్మిది రోజుల ఉత్సవాలు, ప్రతి రోజూ పూజలు. తొమ్మిదవ రోజు సీతారాముల కల్యాణం, ఆ తరువాత వాస్తోత్సవం.
ఎలా జరుపుకుంటారు
తొమ్మిది రోజుల పూజలు
రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక అలంకారం, భజనలు, హరికథ. ప్రతి రోజూ ఒక్కో ఇంటి వారు నైవేద్యం, అన్నదానం బాధ్యత తీసుకుంటారు.
సీతారాముల కల్యాణం
తొమ్మిదవ రోజు స్వామివారి కల్యాణం. ఊరంతా తలంబ్రాలు సమర్పిస్తారు. కల్యాణం తరువాత అన్నదానం.
వాస్తోత్సవం
కల్యాణం తరువాత జరిగే ఉత్సవం. స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్తారు, ఊరి పెద్దలు హారతి ఇస్తారు.